ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ ఛైర్మన్ గా పట్నం లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ
- VOICE OF HERALD

- 3 days ago
- 1 min read
ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ ఛైర్మన్ గా పట్నం లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న వద్ది సురేఖ బాలుడు అనారోగ్య కారణాలతో కొద్దిరోజుల క్రితం రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో వైస్ ఛైర్మన్ గా ఉన్న పట్నం లక్ష్మణ్ కు ఛైర్మన్ ఇంచార్జ్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో పట్నం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మార్కెట్ యార్డు రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కమిటీ పనితీరును మరింత పటిష్టం చేస్తానని పట్నం లక్ష్మణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ లో పారదర్శకత, రైతులకు న్యాయమైన ధరలు అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపిపి నంద్యాల రాఘవరెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వి.ఎస్ ముక్తియార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, నాయకులు అన్నవరం రామమోహన్ రెడ్డి, ఇవి సుధాకర్ రెడ్డి, బచ్చల వీరప్రతాప్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీనివాస్ ఆచారి, నల్లబోతుల నాగరాజు, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, శివాలయం ఛైర్మన్ వంగల నారాయణారెడ్డి, నాయకులు ద్వారాకచర్ల రాఘవరెడ్డి, ధనిరెడ్డి రామచంద్రారెడ్డి, ఘంటశాల వెంకటేశ్వర్లు, వంగనూరు మురళీధర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





Comments