top of page

పొత్తుధర్మం పక్కన పెడితే మేము విమర్శించగలం - జనసేన నాయకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 4 days ago
  • 1 min read

పొత్తుధర్మం పక్కన పెడితే మేము విమర్శించగలం - జనసేన నాయకులు

సమావేశంలో మాట్లాడుతున్న జనసేన నాయకులు
సమావేశంలో మాట్లాడుతున్న జనసేన నాయకులు

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


జనసేన పార్టీ ఆవిర్భవించిందే ప్రశ్నించడానికిని, ఒత్తుధర్మం పక్కన పెడితే తాము విమర్శించగలమని, తాజాగా కడప జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు చేసిన ట్వీట్ పై మండిపడుతూ ప్రొద్దుటూరు జనసేన నాయకులు మంచి శివ స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజాగా టిడిపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తమ నాయకుడు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ, పదవి రాకుంటే పవన్ పై వ్యాఖ్యలు చేయటమేంటని ఇది సమయమా ఇది భావ్యమా అనే ప్రశ్నించారు? క్రమశిక్షణ గల టిడిపి పార్టీలో శ్రీనివాసులు నేర్చుకున్నది ఇదేనా అని యద్దేవా చేస్తూ, జనసేన పార్టీలో ఉన్న తమకు బాధలు లేవా అంటూ, ఏదైనా పొత్తుదుర్మం పాటిస్తూ కూటమిలో కొనసాగుతున్నామని, కడప జిల్లాలోని ఏ జనసేన నాయకుడికైనా గుర్తింపు, గౌరవం, పదవులు ఉన్నాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page