దసరా ఎగ్జిబిషన్ నిర్వహణకు బహిరంగ వేలం: 28న టెండర్లు ప్రారంభం

ప్రొద్దుటూరులో దసరా ఎగ్జిబిషన్ నిర్వహణకు బహిరంగ వేలం: 28న టెండర్లు ప్రారంభం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న భారీ ఎగ్జిబిషన్ గుత్త హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. 2026 అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో దసరా నవరాత్రులు ప్రారంభమైన నాటి నుండి మొత్తం 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన టెండర్-కం-బహిరంగ వేలంపాటను సెప్టెంబర్ 28, 2026 (సోమవారం) ఉదయం 11:00 గంటలకు స్థానిక మునిసిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ వేలంలో పాల్గొనదలచిన గుత్తేదారులు రూ. 25,00,000 (ఇరవై ఐదు లక్షల రూపాయలు) ధరావత్తు సొమ్ముతో పాటు నిర్దేశిత బ్యాంకు గ్యారెంటీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు నిర్ణీత సమయానికి మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని పురపాలక శాఖ అధికారులు కోరారు.



Comments