top of page

కుంగ్-ఫు విజేతలకు బహుమతులు పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 26, 2023
  • 1 min read

కుంగ్-ఫు విజేతలకు బహుమతులు పంపిణీ

కుంగ్-ఫు విజేతలతో ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


శుక్ర, శనివారాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ JKD కుంఫు కరాటే ఛాంపియన్ షీప్ 2023 పోటీలు ప్రొద్దుటూరులో జరగటం, విజేతలకు తన చేతులు మీదుగా బహుమతుల ప్రధానం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని. ఆత్మరక్షణ, దేహదారుఢ్యం, మానసిక వికాసం కొరకు యువత విద్యార్థులు ఇలాంటి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, విద్యతో పాటు క్రీడలు, వ్యాయామం వైపు అడుగులు వేస్తూ చక్కటి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుంగ్-ఫు మాస్టర్ సోహెల్, కుంగ్-ఫు విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పలువురు ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page