top of page

అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ ఎమ్మెల్యే రాచమల్లు - టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 12, 2023
  • 1 min read

అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ ఎమ్మెల్యే రాచమల్లు - టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అంటూ, అందుకు అవసరమైతే కాణిపాకం దేవస్థానంలో ప్రమాణం చేసి శివాలయం సర్కిల్లో ప్రజల ముందు, ఏఎస్పీ కార్యాలయంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమే అని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయనపై బుధవారం ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మరో మారు తనపై కానీ, తన కుటుంబం పై కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే గడిచిన ఆరు నెలల నుండి జరిగిన విషయాలన్నీ బయటపెడతానంటూ హెచ్చరించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఆసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ గా ఉంటూ, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని రాచమల్లు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసారు. స్వాతంత్ర సమరయోధుని కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే రాచమల్లు తన సొంత పార్టీ కౌన్సిలర్లకు, నాయకులకు, అనుచరులకు ఎంతవరకు స్వాతంత్రం ఇచ్చారో చెప్పాలి అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్ల, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page