top of page

ప్రవీణ్ రెడ్డి నాలుగేళ్ల కష్టం మీకేం తెలుసు - మాజీ కౌన్సిలర్ రామ సంజీవ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 18, 2024
  • 1 min read

ప్రవీణ్ రెడ్డి నాలుగేళ్ల కష్టం మీకేం తెలుసు - మాజీ కౌన్సిలర్ రామ సంజీవ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


శుక్రవారం టిడిపి నాయకులు కామిశెట్టి బాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, గత నాలుగు సంవత్సరాలుగా టిడిపి అభ్యున్నతి కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి పడిన కష్టం, పది రోజుల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి ఏం తెలుస్తుందని 29వ వార్డు మాజీ కౌన్సిలర్ రామ సంజీవరెడ్డి, కడప టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గడచిన కొద్ది రోజుల క్రితం టిడిపి తీర్థం పుచ్చుకొన్న కామిశెట్టి బాబుకు, నాలుగేండ్లగా టిడిపి అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ప్రవీణ్ రెడ్డి కృషి పట్టుదల ఏమి తెలుసని ఎద్దేవా చేస్తూ, కనీస పార్టీ సభ్యత్వం లేని కామిశెట్టి బాబు ప్రవీణ్ రెడ్డి పై ఆరోపణలు చేసేంత స్థాయి కాదంటూ గట్టిగా జవాబు ఇచ్చారు. గతంలో ఇదే వ్యక్తి వైసీపీ నాయకుల తో కలిసి నియోజకవర్గ టిడిపి నాయకుల్ని ఇబ్బంది పెట్టారని, కామిశెట్టి బాబు బంధుగణ లబ్ధికోసం టిడిపిని వీడి నాడు వైసిపి లో చేరినట్లు ఆరోపణలు గుప్పించారు.

కామిశెట్టి బాబు టిడిపి పార్టీ పై సవతి ప్రేమ కురిపిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కి అలాగే ప్రవీణ్ కుమార్ రెడ్డి నడుమ జరిగిన సంభాషణ కామిశెట్టి బాబుకు ఏమి తెలుసునని ప్రశ్నించారు? ప్రవీణ్ కుమార్ రెడ్డి తనపై బనాయించిన తప్పుడు కేసులలో జైలుకు వెళితే ఆయన సతీమణి సోదరి పార్టీ పగ్గాలు చేతబూని ఇంటింటికి తిరిగి టిడిపి ప్రచారం నిర్వహించినట్లు గుర్తు చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page