top of page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 19
1 min read

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రజా దర్బర్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
ప్రజా దర్బర్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ధ్యేయంగా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో 'ప్రజా దర్బార్' నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, విద్యుత్, రహదారులు, సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. కేవలం సమస్యలను వినడమే కాకుండా, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీ పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


కేవలం ప్రజా దర్బార్ నిర్వహించే రోజుల్లోనే కాకుండా, నిత్యం కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతోనే ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, పట్టణ మాజీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page