top of page

ఘనంగా పోషణ్ అభియాన్: సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు సన్మానం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 22
1 min read

ప్రొద్దుటూరులో ఘనంగా పోషణ్ అభియాన్: సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు సన్మానం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు అర్బన్ పరిధిలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS) ఆధ్వర్యంలో గోకుల్ నగర్ 8వ వార్డులోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా 'పోషణ్ అభియాన్' కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్, బీజేపీ నియోజకవర్గ మహిళా కార్యదర్శి మరియు పట్టణ ఉపాధ్యక్షురాలు బొలిశెట్టి రెడ్డి ప్రసన్న నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సమాజ శ్రేయస్సుకు, చిన్నారుల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులను గౌరవిస్తూ సీడీపీఓ నీరజ, సూపర్వైజర్ శాంతకుమారి, అంగన్‌వాడీ టీచర్లు సుజాత, శివలక్ష్మి, హెల్పర్లు సలోమి, శోభలతో పాటు ఆశా వర్కర్ రామలక్ష్మిలను నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చిరంజీవి, మోహన్, మహిళా నాయకురాళ్లు కుమారి, అఖిల తదితరులు పాల్గొన్నారు. తమ సేవలను గుర్తించి సత్కరించడం బాధ్యతను మరింత పెంచిందని, రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు.


అనంతరం కేంద్రంలో చిన్నారులు, తల్లులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక మహిళలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు మరియు చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి విశేష కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు, మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు, కార్యకర్తలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంగన్‌వాడీ సేవలను మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిరంజీవి రెడ్డి. బిజెపి కడప జిల్లా కార్యదర్శి చరణ్ రెడ్డి. బీజేవైఎం అర్బన్-1 అధ్యక్షులు నల్లబోతుల వెంకట సుబ్రహ్మణ్యం, చాపాటి రాజేష్, పఠాన్ హబీబ్, హరికృష్ణ వంకధార నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page