top of page

ప్రవీణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం - పోరెడ్డి నరసింహారెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 16, 2023
  • 1 min read

ప్రవీణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం - పోరెడ్డి నరసింహారెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదివారం కడపలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, రాజుపాలెం మండలం వైసీపీ నాయకులు రాజారామ్ రెడ్డి సంయుక్తంగా ఖండించారు. ఈ సందర్భంగా పోరెడ్డి మాట్లాడుతూ ప్రవీణ్ రెడ్డి అసంధర్భోచితంగా మాట్లాడుతున్నారని, తమపై విమర్శలు నిందలు వేసిన కారణంగానే కడప జిల్లా ఎస్పి సిద్ధార్థ కౌశల్ ను కలిసి మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలంటూ వినతిపత్రం ఇచ్చామని, టిడిపి నాయకులు ప్రొద్దుటూరులో ఏనాడు అభివృద్ధిని కాంక్షించలేదని, ఎమ్మెల్యే రాచమల్లు గురించి, పార్టీ టికెట్ గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రవీణ్ కు లేదని అన్నారు. రాజకీయంగా విమర్శిస్తే సమాధానం ఇస్తామని, కుటుంబాన్ని కుటుంబ వ్యవహారాలను రాజకీయాలలోకి లాగటం సబబు కాదని హితువు పలికారు. శాంతియుత ప్రొద్దుటూరులో ప్రవీణ్ కక్షలు కార్పన్యాలు పెంచే విధంగా విమర్శలు చేస్తున్నారని, ముందు రాజకీయంగా ప్రవీణ్ మాట్లాడటం నేర్చుకోవాలని, పోలీసు అధికారులపై ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page