top of page

అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2024
  • 1 min read

గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ నందు అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ నందు సోమవారం అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కన్నులు మిరురమిట్లు గోలిపేలా పాఠశాలలో అలంకరణలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి, సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపి సంక్రాంతి పర్వదినాన పిల్లలకు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిని పాఠశాల నందు తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు వంగల శశిభూషన్ రెడ్డి పాల్గొని, సంక్రాంతి సంబరాలు పిల్లలకు హిందూ ప్రాముఖ్యత తెలియ చేసే విధంగా ఉన్న్నాయని, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు కోలాటం, బండెద్దులు ఎలా నిర్వహిస్తారు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి పొంగలి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గోపికృష్ణ విద్యాసంస్థల కరస్పాండెంట్ కోనేటి కృష్ణ ప్రదీప్, సందీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ గంగయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page