top of page

ఎన్ ఏ డి ఫ్లైఓవర్ పై నాలుగు పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 25, 2022
  • 1 min read

మర్రిపాలెం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జీవీఎంసీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్ఏడి ప్లే ఓవర్ పై నలువైపుల అవుట్ పోస్టులను గురువారం సాయంత్రం జీవీఎంసీ కమిషనర్ జి. లక్ష్మీశా తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పోలీసు శాఖ విన్నపం మేరకు జీవీఎంసీ నిధులతో ఎన్ఏడి బ్రిడ్జిపై నాలుగు పోలీస్ అవుట్ పోస్టు లను ఏర్పాటు చేశారని , ఒక్కొక్క అవుట్ పోస్ట్ ను ఏర్పాటుకు లక్ష రూపాయలు చొప్పున నాలుగు లక్షల రూపాయల వ్యయం అయిందని తెలిపారు. ఎన్ఏడి వద్ద వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకోవడం తో పాటు, ట్రాఫిక్ స్తంభించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటి పరిష్కారానికి ఈ అవుట్ పోస్టు ద్వారా నిరంతరం నిఘా ఉంచి ప్రమాదాలు జరగకుండా చూడవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పర్యవేక్షక ఇంజినీర్ రాజారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి, కార్యనిర్వాహక ఇంజనీర్ సంతోషి, 5వ పట్టణ పోలీసు స్టేషన్ ట్రాఫిక్ సీఐ కె. కృష్ణ , ఇతర జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page