top of page

పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి..!

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 24, 2022
  • 1 min read

పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి..!

విజయవాడ రూరల్, పెట్రోల్ తక్కువ వచ్చిందని ప్రశ్నించిన వినియోగదారుడి పై దాడి చేసిపిడి గుద్దులు తో విరుచుకుపడిన ఘటన రామవరప్పడు లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరప్పడు ఇండియన్ పెట్రోల్ బంక్ లో గుణదల కి చెందిన వర్మ అనే వ్యక్తి 150/- ఇచ్చి పెట్రోల్ కొట్టించు కున్నాడు కానీ అందులో లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడం తో ఆయిల్ తక్కువ వస్తుందని బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. దాంతో ఒక్కసారిగా సిబ్బంది అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచడంతో వర్మ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయాడు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page