పింఛన్ నిధులు విడుదల - కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్
- VOICE OF HERALD

- Jul 31
- 1 min read
పింఛన్ నిధులు విడుదల - కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్

ప్రొద్దుటూరు : ఎన్టీఆర్ భరోసా భద్రత పింఛన్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగష్టు నెలకు సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 14134 మంది లబ్దిదారులకు గాను రూ 6 కోట్ల 70 లక్షల ఆరు వేలు విడుదల చేసినట్లు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. సందర్బంగా వార్డు సచివాలయం సిబ్బందికీ టెలీకాన్ఫెరెన్స్ ఆదేశాలు జారీ చేస్తూ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ఇవ్వాలని, వారితో గౌరవంగా మాట్లాడాలని, లబ్దిదారుల నుండి ఎటువంటి లబ్ది ఆశించకుండా పింఛన్ పంపిణి చెయ్యలని సూచించారు. తాను కూడా ప్రతీ వార్డులో తిరుగుతూ పింఛన్ పంపిణి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తానని కమీషనర్ అన్నారు.





Comments