top of page

జీవీఎంసీలో పెండింగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల వారసుల గర్జన

Writer: EDITOR
EDITOR
1 day ago
1 min read

జీవీఎంసీలో పెండింగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల వారసుల గర్జన

జీహెచ్‌ఎంసీ తరహాలోనే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో మరణించిన మరియు పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో పెండింగ్‌లో ఉన్న 110 ఖాళీ పోస్టులను తక్షణమే వారి కుటుంబ సభ్యుల వారసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గాజువాక చినగంట్యాడ సీఐటీయూ కార్యాలయ ఆవరణలో కార్మికుల కుటుంబ సభ్యులు, వారసుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తుట్టా నూకరాజు మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా 110 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అధికారులు భర్తీ చేయకపోవడం దుర్మార్గమని, దీనివల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న కార్మికులపై తీవ్ర పనిభారం పడటంతో పాటు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు; కావున జీవీఎంసీ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని బాధిత కుటుంబాల వారసులకు ఉద్యోగాలు కల్పించి పనిభారాన్ని తగ్గించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించగా, ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు గొలగాని అప్పారావు, నక్క నాగరాజు, గొల్ల రాము, యజ్జల చిన్నారావు, మీనాక్షి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page