ఎట్టకేలకు ఎమ్మెల్యే వరద ప్రకటనతో జిల్లా ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లింపు
- VOICE OF HERALD

- Jun 23
- 1 min read
ఎట్టకేలకు ఎమ్మెల్యే వరద ప్రకటనతో జిల్లా ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లింపు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గత మూడు నెలలుగా తమకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదంటూ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు నేడు ఆసుపత్రి ఆవరణలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల నిరసనకు తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిన్న రాత్రి ప్రకటన కూడా ఇచ్చారు. నేడు కార్మికుల నిరసన చేస్తున్న ప్రదేశానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ ఎమ్మెల్యే సంఘటన స్థలం వద్దకు వచ్చేలోపే కార్మికులందరికీ మూడు నెలల పెండింగ్ వేతనాలను బ్యాంకు అకౌంట్లో జమ చేశాడు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చొరవ తీసుకొని తమకు జీతాలు పడేలా చేసినందుకు కార్మికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల జీతాల విషయం కాంట్రాక్టర్ తో చర్చించడం జరిగిందని.. జీతాలు పెండింగ్ పెట్టే పరిస్థితి భవిష్యత్తులో జరగకూడదని కాంట్రాక్టర్లకు తెలియజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.





Comments