top of page

జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పసుపుల రాజశేఖర్

Writer: EDITOR
EDITOR
Sep 14
1 min read

జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పసుపుల రాజశేఖర్

చిట్వేలు: తిరుపతి జిల్లా చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ఎన్‌సీసీ అధికారిగా సేవలందిస్తున్న పసుపుల రాజశేఖర్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని రెడ్డి కళ్యాణ మండపంలో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఎంవి రావు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు 2026 లో భాగంగా ఈ అవార్డును ఆయనకు అందజేశారు.


ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అయిన ఎన్.బి.కె.ఆర్. ఐ.ఎస్.టి. డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రముఖ కవి, రచయిత చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి, సత్తివేడు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులం ప్రిన్సిపాల్ నారాయణస్వామి మొదలగు వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, షీల్డ్ మరియు గోల్డ్ మెడల్ తో సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ఎన్‌సీసీ ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడంలో పసుపుల రాజశేఖర్ చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందిందని, ఈ అవార్డు తో వృత్తి పై మరింత బాధ్యతను పెంచిందన్నారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేసి పసుపుల రాజశేఖర్‌ను అభినందించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page