top of page

పగిడాల, దద్దనాల, కూలూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 19, 2024
  • 1 min read

పగిడాల, దద్దనాల, కూలూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం రాజుపాలెం మండల పరిధిలోని పగిడాల, దద్దనాల, కూలూరు గ్రామాలలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారానికి ఆయా గ్రామాలలో టిడిపి అభ్యర్థి వరదకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. పలువురు ముఖ్య నేతలు, నాయకులు వరద వెంట రాగా గ్రామాలలో టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికలలో టిడిపి కడప ఎంపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి కి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల తెదేపా మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రామచంద్రారెడ్డి, పడిగాల ప్రచారంలో మాజీ సర్పంచ్ లు శ్రీకాంత్ రెడ్డి, భూపాల్ రెడ్డి, దేవరాజు,,కాణాల శ్రీకాంతరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, శివరామిరెడ్డి, కిషోర్ రెడ్డి, రవి, వెంకటరెడ్డి, కోడూరు రావినాధరెడ్డి, త్యాగరాజు, శ్రీను, కన్నయ్య, కూలురు ప్రచారంలో మాజీ సర్పంచ్ మల్లిఖార్జునరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, చంద్రారెడ్డి, సహదేవరారెడ్డి, దద్దనాల ప్రచారంలో విశ్వనాథరెడ్డి, పరమేశ్వరరెడ్డి, శివరామ కృష్ణయ్య, చదిపిరాళ్ల వేణుగోపాల్ రెడ్డి, చదిపిరాళ్ల రామమోహన్ రెడ్డి, క్రియాశీలక కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page