top of page

కమీషనర్ తో ముఖాముఖీ కార్యక్రమానికి అనూహ్య స్పందన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 27
  • 1 min read

కమీషనర్ తో ముఖాముఖీ కార్యక్రమానికి అనూహ్య స్పందన

  • ఫోన్ కాల్ ద్వారా ఒక గంటలో 26 ఫిర్యాదులు నమోదు

  • వచ్చిన ఫిర్యాదులలో పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు ప్రధాన సమస్యలుగా నమోదు

  • ఫలించిన నూతన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ ప్రయత్నం


ప్రొద్దుటూరు : ప్రజా సమస్యలు పరిష్కారానికి నూతన కమీషనర్ ఎంచుకున్న మార్గం 'కమీషనర్ తో ముఖాముఖీ' కార్యక్రమం విజయవంతం అయ్యింది. సోమవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ ఇన్ ప్రోగ్రాంకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ముఖాముఖీ కార్యక్రమం గంట వ్యవధిలోనే 26 ఫిర్యాదులు ప్రజల నుంచి ఫోన్ ద్వారా నమోదు చేసారు. నమోదు అయిన సమస్యలలో పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాల తదితర ప్రజా సమస్యలు అగ్రభాగంలో నిలువగా మురుగునీరు నిర్వహణ, ట్రాఫిక్, ఎంక్రోచ్చమెంట్ సమస్యలు కూడా వచ్చిన ఫిర్యాదులలో ఉన్నాయి. ఫోన్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును స్వయంగా కమీషనర్ నమోదు చేసి సత్వర పరిష్కారం కోసం ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపడం జరిగింది. సందర్బంగా కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ, దివ్యాంగులు, వృద్దులు, ఆరోగ్యం సరిగ్గా లేనివారు, మహిళలు, విద్యార్థులు సోమవారం జరిగే పి.జీ.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేకపోవడం వలన సమస్యల పరిష్కారానికి కమీషనర్ తో ముఖాముఖీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా మున్సిపాలిటీ సేవలు మరింత చేరువగా ప్రజలకు అందుబాటులో రానున్నాయని అలాగే అధికారులలో జవాబుదారితనం పెరిగి పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి వీలుంటుందని కమీషనర్ అన్నారు. సంబంధిత అధికారులను సమన్వయం చేసుకొని ప్రతీ సమస్యను స్వయంగా పరిష్కరించడానికి కృషి చేస్తానని కమీషనర్ అన్నారు. ప్రతీ సోమవారం రోజువారి జరిగే పి.జీ.ఆర్.ఎస్ కార్యక్రమానికి గంట ముందు ఉదయం 9 గంటల నుండి పది గంటల వరకు కమీషనర్ తో ముఖాముఖీ ఫోన్ ఇన్ కార్యక్రమం జరుగుతుందని సనస్యల పరిష్కారానికి ప్రజలు ఈ కార్యక్రమాన్ని తప్పక ఉపయోగించుకోవాలని కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ మంజునాథ్ గౌడ్, మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరులు యశోద, రాజేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ సురేంద్ర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page