top of page

డ్రైన్లపై అక్రమ కట్టడాల తొలగింపునకు ఆదేశాలు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 22
1 min read

డ్రైన్లపై అక్రమ కట్టడాల తొలగింపునకు ఆదేశాలు


వర్షపు నీటితో ప్రొద్దుటూరు నగరం అతలాకుతలం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు

ఇటీవల కురిసిన వర్షానికి ప్రొద్దుటూరు నగరం నీటిమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైన్లలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం, కాలువలపై భారీగా అక్రమ నిర్మాణాలు వెలవడమే వర్షపు నీరు సాఫీగా సాగకపోవడానికి, మురుగు కాలువలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణమని గుర్తించారు. ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దేందుకు పారిశుధ్య కార్మికులు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లోని డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక, చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు.


మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ స్వయంగా ఉదయం 4 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బందితో కలిసి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు సాగిస్తున్న యజమానులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలు, బంకులను దశలవారీగా కూల్చివేసేందుకు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page