top of page

నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 25, 2022
  • 1 min read

తణుకు పట్టణంలోని యాపిల్ ఆసుపత్రి హాస్టల్ భవనంలో నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన మాత్రపు షారొన్ కుమారి (21) నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. యాపిల్ ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలలో చదువుతుండగా అదే ఆసుపత్రి భవనం లో హాస్టల్ గదిలో నివాసం ఉంటోoది. ఇటీవల మొదటి సంవత్సరం ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన షారోన్ కుమారి సోమవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ఆంజనేయులు, ఎస్ ఐ వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page