top of page

జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి సమావేశం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2022
  • 1 min read

అనంతపురం జిల్లా, గుంతకల్లు : జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి, అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో గల రాష్ట్ర కార్యక్రమంలో ఈ రోజు, జాతీయ కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ బి యస్ కృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో చర్చించిన విషయాలు, ముఖ్యంగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి, క్యాలెండర్ మరియు, డైరీ ల ఆవిష్కరణ గురించి చర్చించడం జరిగింది. జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ సమితిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని దాని పైన చర్చించడం జరిగింది. వీటిలో కార్మికులకు ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిస్కారం కోసం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్మిక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు, టీ జి సురేష్, జిల్లా కో ఆర్డినేటర్, జి నాగార్జున, జిల్లా జాయింట్ సెకరేట్రి, కే హరి, పట్టణ అధ్యక్షులు కే యశ్వంత్, పట్టణ కార్యదర్శి, బి ప్రకాష్, పట్టణ వైస్ ప్రసిడెంట్ పవన్, పట్టణ మహిళా అధ్యక్షులు, నరసమ్మ పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page