నవ జంటకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- VOICE OF HERALD

- Feb 11, 2022
- 1 min read
కృష్ణాజిల్లా, గుడివాడ, గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో నవ జంటకు తృటిలో తప్పిన పెను ప్రమాదం. గత రాత్రి కాకినాడలో వివాహం ముగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం వస్తున్న పెళ్లి జంట ఆదిత్య, శ్రావణి. కౌతవరం గ్రామం వద్ద మంచు కారణంగా రోడ్డు సరిగా కనపడక అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాల్వలో బోల్తా కొట్టిన పెళ్లి కారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ పెళ్లి జంట, కారులో ఇతర కుటుంబ సభ్యులకు గాయాలు. కాళ్లపారాణి ఆరకముందే ప్రమాదం జరగడంతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు. 108 వాహనం ద్వారా గాయపడినవారిని మచిలీపట్నం తరలింపు.




Comments