top of page

అభిమానుల మధ్య ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 1, 2024
  • 1 min read

అభిమానుల మధ్య ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ప్రొద్దుటూరు నియోజకవర్గ యువనేత సేవా తత్పరుడు భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి తన అభిమానుల మధ్య సోమవారం ఆయన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి పై ఉన్న తమ అభిమానాన్ని చాటుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి జీవితంలో వెలుగులు నింపాలని, ఆయన ప్రజా సేవ చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని వారు ఆకాంక్షించారు. తనపై అభిమానాన్ని చాటుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‌భూమిరెడ్డి సూర్య టీం పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page