top of page

సారూ... కాళ్లు పట్టుకుంటాం రక్షించండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 27, 2022
  • 1 min read

నెల్లూరు జిల్లా, కావలిలో రౌడీ మూకలు రెచ్చిపోయారు, పేదల ఇంటిని కూల్చివేశారు.. దీంతో బాధితులు సారూ... కాళ్లు పట్టుకుంటాం రక్షించండి తమను కాపాడాలంటూ అధికారులను వేడుకున్నారు. ఆర్డీవో కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. ఈ ఘటన అందరినీ కలచివేసింది, కాలనీలో తాము నివసిస్తున్న ఇళ్లను రౌడీ మూకలు కూల్చివేసి, ఆ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ భూమిని కాపాడాలంటూ బాధితులు నెల్లూరు జిల్లా కావలిలో అధికారి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. రౌడీల బెదిరింపులపై ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన, యానాది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సమయంలో ఆర్డీవో తన ఛాంబర్‌ నుంచి బయటికి రాగానే... స్థానిక మహిళ అన్నపూర్ణ కుటుంబసభ్యులు ఆయనను చుట్టుముట్టారు, కాళ్లపై పడి స్థలాన్ని కాపాడాలంటూ వాపోయారు. రౌడీల దాడిలో తాము గాయాల పాలయ్యామని తెలిపారు. చికిత్స తీసుకుని వచ్చాక తలదాచుకునేందుకు కనీసం గూడు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, ఘటనపై సత్వరం విచారణ జరిపించి, న్యాయం చేస్తానని ఆర్డీవో బాధితులకు హామీ ఇచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page