top of page

ఆసియాలో అతి పెద్దదయిన స్క్రీన్ థియేటర్ మూసివేత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 28, 2021
  • 1 min read

నెల్లూరు


ఆసియాలో అతిపెద్దదయిన స్క్రీన్ థియేటర్ మూసివేత


ఆసియాలో అతి పెద్ద స్క్రీన్ కల్గిన నెల్లూరులోని వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ థియేటర్ యాజమాన్యం తెలిపింది. జీవో నెం 35కి అనుగుణంగా థియేటర్ నడపలేనందువల్లే మూసి వేసినట్లు స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు ప్రకటిస్తున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సినిమా హాళ్ల బయట బోర్డులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు నగరం.. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై ఉన్న వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ కలిగిన ఈ థియేటర్‌లో సినిమాని ఎంజాయ్‌ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, జీవో నెం:35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని శనివారం ఉదయం యాజమాన్యం తెలిపింది. దీంతో థియేటర్‌కు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page