రుయా ఆస్పత్రి బాధిత కుటుంబాన్ని వీడియో కాల్ చేసి పరామర్శించిన నారా లోకేష్
- DORA SWAMY

- Apr 26, 2022
- 1 min read
రుయా ఆస్పత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పంతగాని ప్రసాద్.
అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని పెనగలూరు మండలం, కొండూరు ఎస్టీ కాలనీకి చెందిన కంభంపాటి జాశవా బాధిత కుటుంబాన్ని తెలుగు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, టిడిపి నాయకులైన పంతగాని ప్రసాద్ ఈరోజు సాయంత్రం పరామర్శించి మానవత్వాన్ని చాటుకున్నారు.

టిడిపి పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ ద్వారా వీడియో కాల్ చేయించి బాధితుని అనారోగ్యం గురించి, తరువాత తరలింపులో కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందిని తెలియజేశారు. తదుపరి నారా లోకేశ్ మాట్లాడుతూ.. కడు పేదవారైన వారిపట్ల అంబులెన్సు యాజమాన్యం ప్రవర్తించే తీరు సిగ్గుచేటని అన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments