top of page

రాధా కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 4, 2024
  • 1 min read

రాధా కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

బ్యాంకు డిపాజిట్ పత్రాన్ని అందజేస్తున్న నారా భువనేశ్వరి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కడప జిల్లా ప్రొద్దుటూరులోని పెద్ద శెట్టిపల్లి గ్రామానికి వచ్చారు. ప్రొద్దుటూరు మండలం పెద్ద శెట్టిపల్లె గ్రామంలోని ఒకటవ వార్డు మెంబర్ కూరపాటి రాధా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసిన సమయంలో గుండెపోటుతో మృతి చెందారనే విషయం తెలుసుకున్న నారా భువనేశ్వరి, నేడు కూరపాటి రాధా ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండగా ఎల్లప్పుడూ ఉంటున్నారని, కార్యకర్తలను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ విస్మరించదని నారా భువనేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా మూడు లక్షల రూపాయలు కూరపాటి రాధా కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ పత్రాలను రాధా కుటుంబ సభ్యులకు భువనేశ్వరి అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పై వైసీపీ నేతల దౌర్జన్యం, హత్య రాజకీయాలు ఎక్కువ అయ్యాయి అంటూ నారా భువనేశ్వరి విమర్శించారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page