top of page

దారుణ హత్య - వేంపల్లె

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 26, 2022
  • 1 min read

కడప జిల్లా, వేంపల్లె

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణ పరిధిలో ఉన్న చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన కల్లూరు మహేశ్వర రెడ్డి (38)అనే వ్యక్తి దారుణంగా హత్య కాబడ్డాడు చింతలమడుగుపల్లెకు చెందిన మహేశ్వర రెడ్డికి అన్నదమ్ములకు భూతగదాలు ఉన్నట్లు మృతుని భార్య అమ్మణి అరోపణలు చేశారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుండి వెళ్ళిన మహేశ్వర రెడ్డి వేంపల్లిలోని పాత గండి రోడ్డులోని ఈదుల బావి సమీపంలో హత్య అయి పడి ఉన్నాడు మహేశ్వర రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో తలపై బలంగా కొట్టి చంపినారు. అలాగే సమీపంలో ఉన్న కాలువలో మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లి పడేశారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేశ్వర రెడ్డిని అన్నదమ్ములే హత్య చేశారని భార్య అమ్మణి అరోపణలు చేస్తున్నది. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page