top of page

ప్రొద్దుటూరులో దారుణ హత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 14, 2023
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయతి కానపల్లె లో హత్యకు గురైన నాగేంద్ర(32) అనే వ్యక్తి. కానపల్లి ఎస్సీ కాలనీ లో తన అక్క ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న నాగేంద్ర ను గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం ఎంత సేపటికి కిందికి రాకపోవడంతో భార్య పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భర్త, పక్కింటి పై భాగంలో నుంచి దుండగులు వెళ్ళినప్పుడు పడిన రక్తపు మరకలు. హత్యకు గురైన నాగేంద్ర ది ప్రేమ వివాహం కాగా వీరికి ఒక పాప నందన(3), ఒక బాబు నందన్(1). సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page