top of page

మహిళతో సహజీవనం ప్రాణం తీసింది

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 14, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు

స్థానిక రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని మడూరు రోడ్డులోని ఇటుకల బట్టిలో పని చేసే ఇమ్మానియెల్ నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో దారుణంగా హత్య గురయ్యాడు.

మృతుడి తల్లి మేరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రెండవ పట్టణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.., వివరాల్లోకి వెళితే ఇమ్మానియెల్ స్థానికంగా ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడని, గత రాత్రి 11.30 ప్రాంతంలో భర్త రవితో కలిసి సదరు మహిళ ఇమ్మానియెల్ పై కత్తి పొట్లు పొడిచి హత్యాయత్నం చేశారని, తేరుకొని గమనించే లోగా మృత్యువాత పడ్డారని, అక్రమ సంబంధమే హత్యకు గల కారణంగా తల్లి మేరీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీ.ఐ ఇబ్రహీం తెలిపారు.

కేసు నమోదు చేసిన రెండవ పట్టణ పోలీసులు, విచారించి నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page