top of page

తాపీ మేస్త్రి దారుణ హత్యా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 6, 2022
  • 1 min read

ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తాపీ మేస్త్రి దారుణ హత్యా.

యాదవ్ బజార్ కు చెందిన మేకపోతుల శివ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. శివను గుర్తు తెలియని వ్యక్తులు నందిగామ శివారు పాత బైపాస్ రోడ్డు లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ సమీపంలో రాళ్ళతో కొట్టి హత్య చేసారు. శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో ఉన్న రైతులు పొలం వెళ్తున్న రైతులు, ఇసుక బండ్ల నడిపేవారు చూడటంతో హత్య వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న నందిగామ సిఐ కనకరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతిని ద్విచక్ర వాహనం డొంక రోడ్డు పై అడ్డదిడ్డంగా పడి ఉంది. మృతదేహం మాత్రం ద్విచక్ర వాహనానికి దూరంగా అక్కడ ఉన్న కరెంట్ పోల్ సమీపంలో పడి ఉంది. మృతుని ముఖంపై కోసు రాయితో ఇష్టానుసారంగా కొట్టిన ఆనవాలు కనిపిస్తున్నాయి. కాగా మృతిని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపిస్తున్నారు.


ఈ హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మృతుడు మంచి టాఫీ మేస్త్రి గా పేరు ఉంది. ప్రస్తుతం మృతుడు పట్టణ ప్రధాన రోడ్లోని ఒక భవనం, సిఎం రోడ్డులో మరో పలు అంతస్తులు భవన నిర్మాణానికి పనిచేస్తున్నట్లు సమాచారం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page