top of page

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే వరద మద్దతు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 27, 2023
  • 1 min read

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే వరద మద్దతు

సమ్మెకు మద్దతు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వారికి మద్దతు తెలిపారు. న్యాయబద్ధమైన పోరాటంలో వారి వెంటే ఉంటానంటూ హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మద్దతిస్తూ వారి డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేరేంతవరకు తమ పోరాటం ఆగదని వరద హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, వరద అభిమానులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page