top of page

ముగిసిన కౌన్సిల్ అత్యవసర సమావేశం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 30, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు


నేడు ప్రొద్దుటూరు పురపాలక సంఘ అత్యవసర సమావేశం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనం నందు ఉదయం 11:30 కు ప్రారంభమై  అజెండాలోని పలు అంశాలు చర్చకు రాగా కౌన్సిల్ సభ్యులు అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు.

మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్  భీముని పల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పలు కారణాల రీత్యా పలువురు ముస్లిం మైనారిటీ కౌన్సిలర్లు  గైర్హాజరు కాగా సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యులు అజెండా లోని అంశాలకు ఆమోదం తెలిపారు. అజెండా నందు పురపాలక సంఘమునకు చెందిన టీబి రోడ్డు లోని కామిశెట్టీ సుబ్బారావు టీబి షాపింగ్ కాంప్లెక్స్ యొక్క లీజ్ రెన్యువల్ 30.06.2022 తేదీ నాటికి ముగియనుండగా కాంప్లెక్స్ నందు గల లీజుదారుల సమ్మతంతో   రాబో మూడు సంవత్సరాలకు ప్రస్తుత నెల బాడుగ 33% పెంపుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశం నందు కొత్తపల్లి పంచాయతి ఛానల్ మడూర్ కాలువలలో సిల్ట్ తొలగింపు పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page