top of page

రేపు ప్రజలతో మున్సిపల్ కమిషనర్ ముఖాముఖి

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 26
  • 1 min read

రేపు ప్రజలతో మున్సిపల్ కమిషనర్ ముఖాముఖి

ప్రత్యేక కార్యక్రమం : సమస్యలు పరిష్కారం కోసం 'ప్రజలతో కమీషనర్ తో ముఖాముఖీ' కార్యక్రమం ప్రతీ సోమవారం


అమలు తేదీ : 27.07.2026 సోమవారం నుండి సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే. ఒక గంట సమయం ఉంటుంది. అనంతరం రెగ్యులర్ పీజీర్స్ కార్యక్రమం జరుగుతుంది.


ఫిర్యాదు దారులు ఫోన్ చేయవల్సిన నంబర్స్ : 9247563385 / 9849905863


ముఖ్య ఉద్దేశ్యం :

1. మున్సిపాలిటీ సేవలను ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లడం.

2. దివ్యాంగులు, వయో వృద్దులు, మహిళలు, చదువుకుంటున్న విద్యార్థులు, ఆరోగ్యం సహకరించలేనివారు, దూర ప్రాంతాలలో ఉన్న మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది

3. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (PGRS) అనుబందంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది

4. 'టైం లైన్' ప్రకారం సమస్యలను సంబంధిత శాఖా అధికారులు ఫోన్ ద్వారా నమోదు చేసుకున్న సమస్యలు పరిష్కరించినా.. ఒక విధంగా సత్వర పరిష్కారం కోసం ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుంది.

5. అధికారుల జవాబుదారితనం, పారదర్శకత కోసం, సత్వర పరిష్కారం.


  • పరిధి :

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చేయగలిగిన సమస్యలను మాత్రమే ఫిర్యాదులుగా నమోదు చేయబడతాయి.


  • అధికారులు హాజరు :

1. మున్సిపల్ కమీషనర్/ అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్

2. శానిటేషన్ సూపర్ వైజర్ / శానిటరీ ఇన్స్పెక్టర్

3. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ / అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

4. అసిస్టెంట్ సిటీ ప్లానర్ / టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

5. రెవిన్యూ ఆఫీసర్ / రెవిన్యూ ఇన్స్పెక్టర్

6. మెప్మా సెక్షన్ హెడ్

7. PGRS సెక్షన్ సిబ్బంది


  • పర్యవేక్షణ :

1. ఫోన్ ద్వారా నమోదైన ఫిర్యాదులు అదేరోజు సంబంధిత శాఖా అధికారులకు పంపడం పరిష్కార నిమిత్తం జరుగుతుంది.

2. ప్రతీ సోమవారం ఈ ఫిర్యాదులపై సమీక్షా జరుగుతుంది.

3. కమీషనర్ నేరుగా ఈ సమస్యలు పర్యవేక్షించడం జరుగుతుంది.


మోడల్ ఫిర్యాదు : ఫిర్యాదు దారుడు ఫోన్ చేసి ఈ వివరాలు తెలపవలెను.


1. ఫిర్యాదు దారుడు పేరు

2. అడ్రస్

3. సెల్ / ఫోన్ నెంబర్

4. సమస్య వివరణ


ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు అందరు సత్వర పరిష్కారం కోసం ఫోన్ ద్వారా సమస్యలు నమోదు చేసుకోమని విజ్ఞప్తి. నిబంధనలు మేరకు ఫిర్యాదులు పరిష్కరించాబడతాయి అని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, (మాజీ సైనికుడు) తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page