top of page

ప్రజా ధనం - ప్రజల హక్కు: అవినీతిపై ఉద్యమానికి పిలుపునిచ్చిన MPJ ఆంధ్రప్రదేశ్

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 21
1 min read

ప్రజా ధనం - ప్రజల హక్కు: అవినీతిపై ఉద్యమానికి పిలుపునిచ్చిన MPJ ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా "మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ)" ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎంపీజే నాయకులు మాట్లాడుతూ, "అవినీతిని ప్రశ్నిద్దాం - జవాబుదారీతనం సాధిద్దాం" మరియు "ప్రజా ధనం - ప్రజల హక్కు" అనే ప్రధాన నినాదాలతో సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కాకుండా ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులు, కొనుగోళ్లు, లబ్ధిదారుల ఎంపిక వంటి రంగాల్లో అక్రమాలు, లంచాలు, కమీషన్ల రూపంలో దుర్వినియోగం అవుతున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేని పనులు, నాణ్యమైన అభివృద్ధి పనులు, పథకాల నిధులు అర్హులకు చేరడంపై ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు.


రెవెన్యూ, మున్సిపల్, గృహనిర్మాణం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, గనులు, పౌర సరఫరాలు, రవాణా, పోలీస్, విద్యుత్ శాఖలతో పాటు అన్ని రంగాల్లో నాసిరకం పనులు, అవినీతి పెరిగిపోవడం వల్ల దేశాభివృద్ధి కుంటుపడి భవిష్యత్తు అంధకారమవుతోందని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో పార్టీ, కులం, హోదా, అధికారంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, గత రెండేళ్లలో అవినీతి నిరోధక శాఖ (ACB) తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. "అవినీతిని కనుగొని నిర్మూలించుట దేశ అభివృద్ధికి తోడ్పడుదాం" అని పిలుపునిస్తూ, ప్రజలంతా ఈ అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page