"తల్లిప్రేమకు ప్రతిరూపం - తల్లిపాలు"
- EDITOR

- Aug 3
- 1 min read
"తల్లిప్రేమకు ప్రతిరూపం - తల్లిపాలు"

తల్లులకు, గర్భవతులు, కుటుంబ సభ్యులు కు అవగాహన కల్పించిన హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంగల్ రెడ్డి
"తల్లిపాల వారోత్సవాల్లో" భాగంగా ఈరోజు నంది మండలం మెయిన్ రోడ్డు అంగన్వాడీ సెంటర్ నందు బాలింతలు , మరియు గర్భవతులు కుటుంబసభ్యులు వారికి నంది మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ. వెంగల్ రెడ్డి అవగాహన కల్పిస్తూ తల్లిపాలు ఇవ్వడము వలన తల్లి కి బిడ్డకు కలుగు ఆత్మీయత తల్లిపాలు ప్రాముఖ్యత, ఉపయోగాలు ను మరియు తల్లిపాలు ఇచ్చినప్పుడు తల్లి మరియు బిడ్డ ఉండవలసిన ఆకృతులు గురించి వివరించడమైనది తల్లిపాలు ఇచ్చినప్పుడు తల్లులు పాటించవలసిన శుభ్రత గురించి బిడ్డకు తప్పనిసరిగా ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వవలసిన ఆవశ్యకత తల్లులకు గర్భవతులకు క్లిప్ చార్ట్స్ ద్వారా వివరించడమైనది ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ. వెంగల్ రెడ్డి, తో పాటుఅంగన్వాడి టీచర్లు నాగ మహేశ్వరి, లక్ష్మీ దేవి సి.హెచ్.ఓ మహేశ్వరి, ఏ ఎన్ ఎం. యశోదమ్మ ఆశాకర్యకర్తలు మానస,హరిత, మేరమ్మ పాల్గొన్నారు.




Comments