top of page

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ కన్నుమూత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 30, 2022
  • 1 min read

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ (100) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. ఇటీవలే హీరాబెన్‌ వందో పుట్టినరోజును జరుపుకున్నారు. హీరాబెన్‌ మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది’’ అని ట్వీట్‌ చేశారు.


రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌. మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు.


తల్లి హీరాబెన్ పాడే మోసిన నరేంద్రమోదీ


గాంధీనగర్ 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన తన తల్లి దివంగత హీరాబెన్ మోడీ భౌతికకాయాన్ని మోసిన ప్రధాని నరేంద్రమోదీ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page