top of page

శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న వైజాగ్ ఎమ్మెల్సీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 7, 2023
  • 1 min read

శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న వైజాగ్ ఎమ్మెల్సీ

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు పట్టణంలో వెలసిన శ్రీకృష్ణ ఆలయాన్ని వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం సందర్శించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువాలతో సన్మానించి సాదర స్వాగతం పలికి గోత్రనామాల పేరిట స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం గోశాలను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ముందుగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి యాదవులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ ఆలయ, గోశాల అభివృద్ధికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని, ఈ విషయమై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాను ఎమ్మెల్సీ వంశీ త్వరలో చర్చించి గోశాల మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి, కొత్తపల్లి 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page