top of page

సుబ్రహ్మణ్యం హత్యపై కీలక వివరాలు వెల్లడించిన ఎస్పీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 23, 2022
  • 1 min read

సుబ్రహ్మణ్యం హత్యపై కీలక వివరాలు వెల్లడించిన ఎస్పీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును స్పెషల్ మొబైల్ జడ్జి ముందు హాజరుపరుస్తామని ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. కేసు విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబును నిందితుడిగా గుర్తించామన్నారు. ఈ నెల 19న సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అనంతబాబు తెలిపారన్నారు. శ్రీరామ్‎నగర్ శంకర్ టవర్ వద్ద అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య ఘర్షణ జరిగిందని.. తోపులాటలో ఐరన్ రాడ్ తగిలి సుబ్రహ్మణ్యంకు బలమైన గాయమైందన్నారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో సుబ్రహ్మణ్యం శ్వాస ఆగిపోయిందని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి చెందటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనంతబాబు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించాలంటే.. బాడిలో అన్ని చోట్ల గాయాలు ఉండేలా సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు కర్రతో కొట్టినట్లు ఎస్పీ రవీంద్ర బాబు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు అనంతబాబును అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలిస్తున్నామని తెలిపారు. మరిన్ని విషయాలు పూర్తి దర్యాప్తులో తెలుస్తాయని ఎస్పీ రవీంద్ర బాబు స్పష్టం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page