top of page

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం - ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 7
  • 1 min read

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం - ఎమ్మెల్యే వరద

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారాయని, ఇప్పటి వరకు సకాలంలో వర్షాలు ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు.


ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టుల్లోకి కూడా తగిన స్థాయిలో నీరు చేరలేదని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే మాత్రమే ఒక పంటకు సరిపడా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే వర్షాధార పంటలను సాగు చేయాలని, పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలని వరదరాజుల రెడ్డి రైతులకు సూచించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page