top of page

లంచగొండి అధికారులారా సెలవుపై వెళ్లండి - ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 20, 2024
  • 1 min read

లంచగొండి అధికారులారా సెలవుపై వెళ్లండి - ఎమ్మెల్యే వరద

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


మంగళవారం ఉదయం స్థానిక ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే వరద, గతంలో ఇకపై లంచాలు పుచ్చుకోమని ఇక్కడి అధికారినితో దేవుడిపై ప్రమాణం చేయించినా, తీరులో మార్పు రాలేదని ఆవేదన చెందుతూ, అవినీతికి పాల్పడం లంచాలకు చేయిచాచము అని ప్రమాణం చేసిన అధికారులలో కూడా మార్పు రాలేదని మండిపడ్డారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన వారితో డబ్బులు వసూలు చేస్తూ, ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి లంచాల ద్వారా వచ్చిన సొమ్మును రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని ఎమ్మెల్యే వరద రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కి చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన లంచగొండి అధికారులు లంచాలు తీసుకోవాలని ఇకపై అనుకుంటే తమ విధులకు సెలవు పెట్టి వెళ్ళిపోవాలని తీవ్రంగా హెచ్చరించారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page