పేదల సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం – ఎమ్మెల్యే వరద

ప్రొద్దుటూరులో పీఎంఏవై (అర్బన్) 2.0 మంజూరు పత్రాల పంపిణీ: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం – ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని స్థానిక సాంబయ్య గారి వీధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 'పీఎంఏవై (అర్బన్) 2.0 పథకం' కింద పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాల (పట్టాల) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలువుతున్న ఈ పథకం ద్వారా లబ్ధిదారులు సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే గృహ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం, గృహ నిర్మాణ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహకారం అందించాలని కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌తో పాటు సంబంధిత అధికారులకు సూచించారు.





Comments