రేపు ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్
- VOICE OF HERALD

- Dec 18, 2025
- 1 min read
రేపు ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రేపు అనగా 19వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థానిక నెహ్రు రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు పత్రిక ముఖంగా తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజలు తనను నేరుగా కలిసి వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడంతో గతంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో రేపు నిర్వహించనున్న ప్రజా దర్బార్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.



Comments