top of page

ఎమ్మెల్యే కుమారుడు ప్రయాణిస్తున్న కారు కు ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 2, 2022
  • 1 min read

తూర్పు గోదావరి జిల్లా, ఐ.పోలవరం మండలం పాతఇంజరం 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న కారు కు ప్రమాదం. ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ర్ ను ఢీ కొన్న కారు. ప్రమాదంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పెద్ద కుమారుడు సుమంత్, సుమంత్ బంధువు లోకేష్ కు తీవ్ర గాయాలు.

క్షతగాత్రలను హైవే మొబైల్ వాహన సిబ్బంది గమనించి వారిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మెరుగైన వైద్యం కోసం యానాం నుండి కాకినాడ తరలింపు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page