సీతారాములకు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రాచమల్లు
- VOICE OF HERALD

- Apr 17, 2024
- 1 min read
సీతారాములకు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రాచమల్లు



వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు, ప్రసన్న ఆంధ్ర - ఏప్రిల్ 17
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వైసిపి యువ నాయకులు మొడెం సందీప్ రాయల్, ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గడచిన కొద్ది సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణానికి కోయంబత్తూరు నుండి ప్రత్యేకంగా తెప్పించిన ముత్యాలు తలంబ్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విశిష్ట అతిథిగా పట్టణంలోని స్థానిక విజయనగరం వీధి నందు గల సందీప్ స్వగృహం నుండి కోనేటి కాలువ వీధి నందు గల శ్రీ కోదండ రామాలయం వరకు మేళ తాళాలతో ఊరేగింపుగా ముత్యాల తలంబ్రాలు తలపాగా ధరించిన ఎమ్మెల్యే రాచమల్లు వెండి పల్లెంలో తీసుకురాగా, రామాలయ కమిటీ కోశాధికారి గుత్తి సుబ్బరాయుడు, కమిటీ మెంబర్లు ఆయనకు సాదర స్వాగతం పలుకుగా ముత్యాల తలంబ్రాలను సీతారాములకు సమర్పించారు. భక్తిశ్రద్ధలతో సీతారామ కళ్యాణం తిలకించి ఆశీస్సులు పొందిన రాచమల్లు, అక్కడికి విచ్చేసిన భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, రాచమల్లు అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.







Comments