top of page

సోనియా గాంధీ పెంపుడు కూతురుగా షర్మిల వ్యవహరిస్తోంది - ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 22, 2024
  • 1 min read

సోనియా గాంధీ పెంపుడు కూతురుగా షర్మిల వ్యవహరిస్తోంది - ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వైసిపి పనితీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్వార్థం కోసం చేసినవేనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా మార్పులు చెందాయని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంలో, అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని కూడా అందించిన ఘనత వైసిపి పార్టీ దేనని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం పెరుగుతుంది అన్న షర్మిల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడుతూ, గతంలో నేను జగనన్న సంధించిన బాణాన్ని అని షర్మిల ప్రజలలోకి వచ్చి, నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి వైసిపి ప్రభుత్వాన్ని తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయటం సబబు కాదని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆడిన రాజకీయ చదరంగ ఆటలో షర్మిల పావుగా మారారని అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాజకీయ పార్టీగా తెలంగాణలో వైఎస్సార్టిపి స్థాపించిన షర్మిల అనతి కాలంలోనే ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని గద్దె దించుతామని షర్మిల ప్రకటించడం పట్ల ఆయన స్పందిస్తూ, నేటి నుండి షర్మిలను వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తాము గుర్తించటం లేదని, సోనియా పెంపుడు కూతురుగా షర్మిల వ్యవహరిస్తుందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై వైయస్సార్సీపి పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై లేదా ఆ పార్టీ నాయకులు పై షర్మిలా చేసే ఏ వ్యాఖ్యల కైనా తమ సమాధానం మర్యాదపూర్వకంగానే ఉంటుందంటూ ఆయన జవాబిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page