top of page

డాక్టర్ కావాలన్న కల నెరవేరింది - రష్యాలో ఎంబిబిఎస్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 22, 2023
  • 1 min read

డాక్టర్ కావాలన్న కల నెరవేరింది

- రష్యాలో ఎంబిబిఎస్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


మరోసారి మానవత్వం చాటుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. డాక్టర్ కావాలన్నా తన కోరికను కలను నెరవేర్చిన ఎమ్మెల్యే రాచమల్లుకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని వాత్సల్య శ్రీ. వివరాల్లోకి వెళితే నిరుపేద కుటుంబానికి చెందిన వాత్సల్య శ్రీ ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరికతో రష్యాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ నందు ఎంబిబిఎస్ సీట్ సంపాదించిన తాను ఎమ్మెల్యే రాచమల్లును సంప్రదించగా, సహృదయంతో స్పందించిన ఆయన వాత్సల్య శ్రీ రష్యాలో ఎంబిబిఎస్ చదువుటకు ఏ మేరకు ఖర్చు అవుతుందో అంతా తానే భరించి చదివిస్తానని, ఇందుకుగాను ఖర్చు అయ్యే 50 లక్షల రూపాయలు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని, అలాంటి సదుద్దేశంతోనే తాను వాత్సల్య శ్రీ ను రష్యాలో ఎంబిబిఎస్ చదివించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వాత్సల్య శ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page