సిహెచ్ఎస్ సభ్యుడు మేకల సుబ్రహ్మణ్యం స్మృతికి చిహ్నంగా జ్ఞాపికను అందించిన సభ్యులు
- DORA SWAMY

- Apr 10, 2022
- 1 min read
సిహెచ్ఎస్ సభ్యుడు మేకల సుబ్రహ్మణ్యం స్మృతికి చిహ్నంగా జ్ఞాపికను అందించిన సభ్యులు.
---తన మృతి తీరని లోటని పేర్కొన్న ప్రధాన కార్యదర్శి.ఇంతియాజ్
గత కొద్ది నెలల క్రితం కువైట్ దేశంలో కరోనా మహమ్మారి కి గురై మృతి చెందిన 'చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ' కార్యవర్గ సభ్యుడు మేకల సుబ్రహ్మణ్యం..సంస్థ అభివృద్ధి కోసం కువైట్ లో కీలకంగా సేవలందించినందుకు గుర్తుగా సి హెచ్ ఎస్ సభ్యులు ఈ రోజు వారి స్వగ్రామం చెర్లోపల్లి కి వెళ్లి సుబ్రమణ్యం సతీమణి పద్మావతి కి జ్ఞాపికను మరియు , 10 గ్రాముల బంగారు నాణెం అందచేశారు.
ఈ సందర్భంగా సిహెచ్ఎస్ ప్రధాన కార్యదర్శి గాడి ఇంతియాజ్ మాట్లాడుతూ... మేకల సుబ్రహ్మణ్యం సంస్థను ఆర్ధికంగా బలపరించినందుకు కువైట్ లో కిలకంగా వ్యవహరించేవాడని, అందరితో ఎంతో ఆప్యాయంగా వ్యహరిస్తూ , ఉద్యోగ రీత్యా స్వదేశం నుండి వెళ్లినవారికి తనవంతుగా సాయం చేసేవాడని , మన ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పుడు పరితపిస్తూ , తన ఆలోచనలు సభ్యులతో పంచుతూ సమస్యకు పరిష్కారం సూచించే వాడని... సుబ్రహ్మణ్యం మృతి సిహెచ్ఎస్ సంస్థకు తీరని లోటని , సంస్థ సభ్యులము వారి కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తమవంతు సాకారం అందిస్తామని తెలుపుతూ సుబ్రమణ్యం కుటుంబ స్బభ్యులకు మనోధైర్యం ఇచ్చారు .
తన భర్త సేవలను గుర్తించి సత్కరించినందుకు మరియు సి హెచ్ ఎస్ చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి సంస్థలో సభ్యుడుగా కొనసాగినందుకు గర్వాంగా ఉందని సుబ్రమణ్యం సతీమణి తెలిపారు .
గ్రామ వాసులు, బాధితుని తండ్రి జయరామయ్య మాట్లాడుతూ మా అబ్బాయి మృతి తర్వాత తమ కార్యకలాపాలలో చేదోడు వాదోడుగా ఉంటూ, సానుకూలంగా స్పందిస్తున్న 'చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ' సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఎస్ ఉపాధ్యక్షులు బొంతల శివనాగేశ్వర్ రావు , గాలా శివారెడ్డి,వలసాని గుండాలయ్య , ఓబినేని శివ , పెమ్మసాని పురుషోత్తం చౌదరి తదితరులు పాల్గొన్నారు .


Comments