ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల
- VOICE OF HERALD

- 1 hour ago
- 1 min read
ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల, కేక్ కటింగ్

కడప జిల్లా, ప్రొద్దుటూరు
పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల ముగింపు సందర్భంగా నేడు ప్రొద్దుటూరులోని స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం నందు కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ, చిరంజీవి అన్నయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, మరొక జన్మ ఉంటే మళ్లీ చిరంజీవి అభిమానిగానే పుట్టాలని తామంతా ఆ దేవుడిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు షరీఫ్ టైర్స్, చంద్రధర్, చల్లా రవికుమార్, సాగర్, బియ్యం కేశవ, జనసేన అడ్వకేట్ రమేష్, నెట్ బాషా, సుదర్శన్, ఇమామ్, బాబు రావు, చెన్న రవి, రాము, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.




Comments