top of page

పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయం - ఎమ్మెల్యే వరద

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jul 24
1 min read

పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయం - ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


విద్యార్థినీ విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయుల మధ్య క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్స్ మీట్ సమావేశాలు విద్యాశాఖ ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక ఎద్దుల సుబ్బమ్మ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల ప్రోత్సాహక కార్యక్రమంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లితండ్రులు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బాలికల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే వరద త్వరలో వైవిఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు త్రాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇస్తూ పిల్లల చదువు క్రమశిక్షణపై తల్లితండ్రులు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల మౌలిక వసతులు పౌష్టిక ఆహారం అందించటమే ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులతో పాటు వారి తల్లితండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page